నిర్భయ దోషులకు ఏ అవకాశాలు లేవు: ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఇక ఎటువంటి చట్టపరమైన అవకాశాలు మిగిలిలేవని ఢిల్లీ కోర్టు గురువారం స్పష్టం చేసింది. మార్చి 20న నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దోషులు ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మలను ఉరితీయాలంటూ ఢిల్లీ కోర్టు డెత్‌వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... తాము దాఖలు చేసిన పలు పిటిషన్లు, అభ్యర్థనలు పెండింగ్‌లో ఉండటం, రెండోసారి క్షమాభిక్ష కోరే అవకాశాలు పరిశీలించేంత వరకు ఉరిని నిలుపుల చేయాలని బుధవారం వీరు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం.. దోషులకు ఇక ఏ అవకాశాలు లేవని పేర్కొంది. ఈ సందర్భంగా వారు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఇదిలా ఉండగా... ఈ కేసులో దోషి పవన్‌ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్‌ పిటిషన్‌ను గురువారం సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చిన విషయం తెలిసిందే.(‘నిర్భయకు ఇక న్యాయం జరుగుతుంది’)