న్యూఢిల్లీ : ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారి అంకిత్ శర్మ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన హత్యలో ఆమ్‌ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహీర్ హుస్సేన్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో గత బుధవారం ఐబీ అధికార అంకిత్ శర్మ మృతి చెందిన విషయం తెలిసిందే. అంకిత్‌ను దారుణంగా హత్య చేసిన దుండగులు.. మృతదేహాన్ని మురికి కాలువలో పడేసి వెళ్లారు. అయితే ఈ హత్యను తాహిర్, అతని మద్దతుదారులే చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చంద్ బాగ్ లోని ఆప్ నాయకుడు, మునిసిపల్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ కు చెందిన భవనం నుండి కొంతమంది వ్యక్తులు రాళ్ళు రువ్వారని అంకిత్ శర్మ కుటుంబ సభ్యులు ఆరోపించారు. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అంకిత్ దాడి చేశారని అంకిత్ తండ్రి రవీందర్ కుమార్ పేర్కొన్నారు.
అంకిత్ శర్మ హత్య కేసు : ఆప్ నేతపై అనుమానాలు..!