ఎన్ని కుట్రలు చేసినా...న్యాయమే గెలుస్తుంది : చిదంబరం

ఎన్ని కుట్రలు చేసినా...న్యాయమే గెలుస్తుంది : చిదంబరం


* ఆర్థిక వ్యవస్థను బిజెపి ప్రభుత్వం కుప్పకూల్చింది..ఉల్లి ధరలు పెరిగినా ఈ ప్రభుత్వానికి పట్టదు... : చిదంబరం
ఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో తీహార్‌ జైలు నుంచి విడుదలైన కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు పి. చిదంబరం గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చిదంబరం పేర్కొన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో తాను ఏం చేశానో అందరికీ తెలుసు. తనతో పని చేసిన అధికారులు, తనను గమనించిన జర్నలిస్టులకు బాగా తెలుసు అని కేంద్ర మాజీ మంత్రి చెప్పారు. ' ఆర్థిక వ్యవస్థను బిజెపి ప్రభుత్వం కుప్పకూల్చింది. ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోడీ ఏనాడు మాట్లాడరు. ఉల్లి ధరలు పెరిగినా ఈ ప్రభుత్వానికి పట్టదు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు.. వాటి గురించి పట్టించుకోరు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు ' అని చిదంబరం పేర్కొన్నారు. 106 రోజుల అనంతరం నిన్న (బుధవారం) రాత్రి 8 గంటలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నానని చిదంబరం స్పష్టం చేశారు.